పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలులో సభ జనం పలుచగా ఉండటంతో పావుగంట వేచిచూసిన షర్మిల ఆపై ప్రసంగిస్తూ, చంద్రబాబుపై విమర్శలు పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలులో వైసీపీ తరఫున నిలబడిన అభ్యర్థి శ్రీనివాసనాయుడు తరఫున ప్రచారం చేసేందుకు వచ్చిన షర్మిల, సభా వేదిక వద్ద అనుకున్నంత మంది ప్రజలు లేరని తెలియడంతో, తన కాన్వాయ్ ని 15 నిమిషాల పాటు నిలిపేశారు. దేవరాపల్లి నుంచి నిడదవోలుకు ఆమె బస్సు...
ఖమ్మం: టీఆర్‌ఎస్‌ నుంచి ఖమ్మం ఎంపీ సీటు తనకు దక్కకపోవడంతో కొన్ని రోజులుగా అసంతృప్తితో ఉన్న ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి అలక వీడారు. టీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వర రావు గెలుపునకు కృషి చేస్తానని తెలిపారు. అలాగే సీఎం కేసీఆర్‌ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని తెలిపారు. 2013లో వైఎస్‌ జగన్‌ పిలుపుతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌లో చేరానని తెలిపారు....
3 ఎమ్మెల్సీ స్థానాల్లో ఓడించాక ఫేస్ బుక్ పోస్టుకు స్పందించాడుకులాల పేరుతో టీఆర్ఎస్ రాజకీయం చేస్తోందికరీంనగర్ లో మీడియాతో కాంగ్రెస్ నేత ఓటు హక్కులేని పిల్లలతో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నేత పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. కులాల పేరుతో టీఆర్ఎస్ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. కరీంనగర్...
ఇంతమంది కమెడియన్లలో ఏ స్థానమో చెప్పలేం చెప్పుడు మాటలు చెప్పడు నాయక్ తో భగవంతుడే బ్రేక్ ఇచ్చాడు టాలీవుడ్ స్టార్ కమెడియన్ అలీ సహనటుడు, రచయిత పోసాని కృష్ణమురళిపై తన అభిప్రాయాలు వెల్లడించారు. పోసాని తెరకెక్కిస్తున్న 'ముఖ్యమంత్రి గారు మీరు మాటిచ్చారు' సినిమా టైటిల్ ఆవిష్కరణ కార్యక్రమంలో అలీ కూడా పాల్గొన్నారు....
ఈ సినిమా ఓటర్లను ప్రభావితం చేసేలా ఉందితెలంగాణను సోనియా గాంధీ ఇచ్చిందికానీ కేసీఆర్ తెచ్చినట్లు సినిమా తీశారు తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘ఉద్యమ సింహం’  సినిమా ఓటర్లను ప్రభావితం చేసేలా ఉందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు తెలిపారు. తెలంగాణ ఇచ్చిందని సోనియా గాంధీ అయితే,...
ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన రైతు…..స్పందించిన సీఎం కేసీఆర్ సమస్య ఖతం అయితది తమ్మీ అంటూ కేసీఆర్‌ భరోసా రైతు గ్రామానికి వెళ్లి విచారించిన కలెక్టర్‌ సాయంత్రానికల్లా రైతుబంధు సాయం ఇద్దరు అధికారుల సస్పెన్షన్‌ ఈనాడు, హైదరాబాద్‌- నెన్నెల, న్యూస్‌టుడే నేను రైతును. నా భూమిని వేరేవారి పేరున మార్చి పట్టా ఇచ్చారు. 11 నెలల నుంచి...
దేవనకొండ: కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కాలినడకన శ్రీశైలం వెళుతున్న కర్ణాటక భక్తులపైకి కర్నూలు-బళ్లారి రహదారిపై ఓ లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బళ్లారి జిల్లా ఎర్రగుడి గ్రామానికి చెందిన 42 మంది భక్తులు ఉగాది సందర్భంగా స్వగ్రామం నుంచి కాలినడకన శ్రీశైలం బయలుదేరారు. కప్పట్రాళ్ల సమీపంలో బుధవారం...
హైటెక్ సిటీ ప్రాంతంలో పనిచేసే సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు హైదరాబాద్ మెట్రో శుభవార్త చెప్పింది. అమీర్‌పేట-హైటెక్‌సిటీ మధ్య వచ్చేవారం నుంచి మెట్రో రైలు కూత పెట్టనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఈ కారిడార్‌లో పనులు గత నవంబరు నాటికే పూర్తి కాగా, తాజాగా రైళ్లు నడిపేందుకు కమిషనర్ ఆఫ్ మెట్రో రైల్ సేఫ్టీ (సీఎంఆర్ఎస్) అనుమతి ఇచ్చింది. గత కొన్ని రోజులుగా ఈ మార్గంలో ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్...
  దక్షిణ మధ్య కర్ణాటక నుంచి విదర్భ వరకు, ఉత్తర మధ్య కర్ణాటక, మరట్వాడా మీదుగా దాదాపు కిలోమీటర్ ఎత్తున ఉపరితల ద్రోణి కొనసాగుతుండటంతో హైదరాబాద్ సహా, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగాయి. గత రెండు రోజులుగా సాధారణం కన్నా 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా ఉన్న ఉష్ణోగ్రత, మంగళవారం నాడు 38 డిగ్రీలకు చేరింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో గాలిలో తేమ శాతం తగ్గిపోతుండగా, నగర...
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అసెంబ్లీ ఆవరణలో జరిగిన పోలింగ్ లో ముఖ్యమంత్రి ఓటు వేశారు. 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఈరోజు పోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. పోలింగ్ ప్రారంభానికి ముందు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా తెలంగాణ భవన్ లో జరిగిన మాక్ పోలింగ్ లో పాల్గొన్నారు. అనంతరం ప్రత్యేక బస్సుల్లో అసెంబ్లీకి వచ్చారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా...