ఎన్నికల కోసం ఐటీ సెంటర్ ఏర్పాటు తొలుత మూడంతస్తుల భవంతి, ఇప్పుడు ఒక్క అంతస్తు మాత్రమే 350 మందిని తొలగించిన జనసేన! వైఎస్ఆర్ కాంగ్రెస్ దీ అదే దారి! నిన్నమొన్నటి వరకూ దాదాపు 500 మందికి పైగా ఉద్యోగులతో కళకళలాడిన జనసేన ఐటీ సెంటర్ కు ఇప్పుడు టూ-లెట్ బోర్డు కనిపిస్తోంది. ఎన్నికలకు ముందు పార్టీ సామాజిక మాధ్యమ ప్రచారం కోసం హైదరాబాద్, రాయదుర్గంలోని ఖాజాగూడ సమీపంలో మూడంతస్తుల...
రెండు కేంద్రాల్లో ఓటర్ల సంఖ్య కంటే ఎక్కువ పోలింగ్ అద్దంకి నియోజకవర్గంలో ఘటన వివరణ ఇచ్చిన ఎన్నికల అధికారి సాయిబాబు ప్రకాశం జిల్లాలోని అద్దంకి నియోజకవర్గంలో విచిత్రం చోటుచేసుకుంది. సంతమాగులూరు మండలం 48వ పోలింగ్ కేంద్రంలో, అద్దంకి పట్టణంలోని 154వ పోలింగ్ కేంద్రంలో ఉన్న ఓటర్ల కంటే పడిన ఓట్లు ఎక్కువగా ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. సంతమాగులూరు మండలంలోని 48వ పోలింగ్‌ కేంద్రంలో 299 మహిళా ఓటర్లు ఉండగా 350...
భార్యతో కలిసి దారుణం మృతుడి తొలి భార్య ఫిర్యాదుతో వెలుగులోకి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘటన డబ్బు కోసం దారుణానికి ఒడిగట్టాడో ఉపాధ్యాయుడు. భార్యతో కలిసి తోడల్లుడినే హత్యచేశాడు. గుట్టుచప్పుడుకాకుండా కుట్ర అమలు చేసినా పాపం పండడంతో కటకటాలపాయ్యాడు. భద్రాద్రికొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కొమ్ముగూడెం గ్రామంలో జరిగిన ఈ ఘోరానికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలాఉన్నాయి.  గ్రామానికి చెందిన రాజువాల్‌ అశ్వాపురం మండలం వెంకటాపురం ప్రభుత్వ...
ఈ ఏడాది 96 శాతం వర్షాలు కురిసే అవకాశం జూన్-సెప్టెంబరు మధ్య విస్తారంగా వానలు సాధారణం-సాధారణానికి సమీపంలో పదాలు రెండూ ఒకటేనన్న ఐఎండీ చీఫ్ దేశంలోని రైతులకు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శుభవార్త చెప్పింది. ఈ ఏడాది వర్షపాతం సాధారణానికి సమీపంలో ఉండే అవకాశం ఉందని పేర్కొంది. ఎల్‌పీఏ (దీర్ఘకాల సగటు)లో 96 శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. అయితే, తొలి విడత వర్ష...
మైత్రీ మూవీ మేకర్స్ వారు మంచి సినిమా చేశారు కిషోర్ తిరుమల తన సత్తా చాటుకున్నాడు యువతకి మంచి సందేశం వుంది కిషోర్ తిరుమల దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ .. కల్యాణి ప్రియదర్శన్ జంటగా తెరకెక్కిన 'చిత్రలహరి' సినిమా ఈ నెల 12వ తేదీన భారీస్థాయిలో థియేటర్లకు వచ్చింది. తాజాగా ఈ సినిమా చూసిన చిరంజీవి .. తనదైన శైలిలో స్పందించారు. 'చిత్రలహరి' సినిమా చూశాను .. చాలా బాగుంది....
రూ.8 కోట్ల పార్టీ ఫండ్ ఇవ్వాలని శ్రీనివాస్ బెదిరిస్తున్నాడు ఇవ్వకుంటే అంతు చూస్తామని హెచ్చరించాడు సీఎం ఇంటి నంబర్ నుంచి కూడా కాల్ చేశాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పీఎస్ శ్రీనివాస్ తో పాటు దొరబాబు అనే వ్యక్తి తనను పార్టీ ఫండ్ కోసం తనను బెదిరిస్తున్నారని విజయవాడకు చెందిన వ్యాపారి రవికాంత్ ఆరోపించారు. ఈరోజు 10 గంటల్లోగా రూ.8 కోట్లు పార్టీ ఫండ్ ఇవ్వాల్సిందిగా తనపై ఒత్తిడి...
ఎస్-క్రాస్ పై రూ. 55 వేల డిస్కౌంట్ ఫేస్ లిఫ్ట్ పై రూ. 33 వేల తగ్గింపు ఏప్రిల్ నెలలో మాత్రమేనన్న మారుతి సుజుకి ఇండియాలో అత్యధికంగా కార్లను విక్రయిస్తున్న అతిపెద్ద సంస్థ మారుతి  సుజుకి, వివిధ మోడళ్లపై భారీ డిస్కౌంట్ రేట్లను ప్రకటించింది. తమ ప్రధాన డీలర్‌ షిప్‌ నెక్సా ద్వారా  విక్రయిస్తున్న కార్లకు ఈ డిస్కౌంట్లు వర్తిస్తాయని, ఎంపిక చేసిన పలు రకాల మోడళ్లపై...
పరీక్షలు రద్దు చేసి మళ్లీ చేపట్టాలని డిమాండ్ ముందస్తు సమాచారం ఇవ్వలేదని ఆగ్రహం ఆరుగురు విద్యార్థులు ఛాన్స్ కోల్పోయారని ఆవేదన ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రి(రాజమహేంద్రవరం)లో ఉన్న అల్లు రామలింగయ్య ప్రభుత్వ హోమియో కళాశాల విద్యార్థులు ఈరోజు ఆందోళనకు దిగారు. కళాశాల నిర్వహిస్తున్న పరీక్షలకు మూకుమ్మడిగా బహిష్కరించారు. కళాశాల అధికారుల నిర్వాకం కారణంగా ఆరుగురు విద్యార్థులు నష్టపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై ఓ విద్యార్థి మీడియాతో మాట్లాడుతూ.. పరీక్షలకు...
ఇంటి నుంచి పొమ్మంటోందంటూ తల్లి భానుమతి ఆరోపణ వార్థక్యంలో తానెక్కడికి వెళ్లగలనని ఆవేదన వివరణ కోరిన మహిళా కమిషన్‌ ప్రతినిధులు మామగారి నుంచి వారసత్వంగా తనకు సంక్రమించిన ఇంటి నుంచి కన్నకూతురే తనను గెంటేయాలని చూస్తోందని, ముదిమి మీదపడిన ఈ వయసులో తాను ఎక్కడికి వెళ్లగలనని సినీనటి సంగీత తల్లి భానుమతి ఆరోపించారు. కూతురి చర్యను వ్యతిరేకిస్తూ ఆమె మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. తనను ఇంటి నుంచి...
హైదరాబాదులో బంగారం, వెండి ధరలు:  24 క్యారెట్ల బంగారం 10 గ్రా  రూ. 32,100  22 క్యారెట్ల బంగారం 10 గ్రా  రూ. 30,600  వెండి కిలో ధర రూ.37,250 వివిధ మార్కెట్లలో శుక్రవారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.32,100, విజయవాడలో రూ.32,850, విశాఖపట్నంలో రూ.32,710, ప్రొద్దుటూరులో రూ.32,650, చెన్నైలో రూ.31,760గా ఉంది. ఇక 22 క్యారెట్ల...