టిడ్కో లబ్ధిదారులకు రుణాల మంజూరులో జాప్యం లేకుండా చూడాలి: జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి

  పశ్చిమగోదావరి జిల్లా, భీమవరం, జూలై 18 : టిడ్కో లబ్ధిదారులకు రుణాల మంజూరులో జాప్యం లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి బ్యాంకర్లను ఆదేశించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి భీమవరం, తాడేపల్లిగూడెం, పాలకొల్లు మున్సిపల్ కమిషనర్లు, వివిధ బ్యాంకుల ప్రతినిధులతో సమావేశమై టిడ్కో లబ్ధిదారులకు రుణాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 75 శాతం నిర్మాణాలు పూర్తయిన వాటికి లోను రిలీజ్…

Read More

రవితేజ ‘వెంకీ’ రీ-రిలీజ్‍కు రెడీ.. డేట్ ఖరారు..

రవితేజ హీరోగా నటించిన వెంకీ సినిమా 2004లో విడుదలై సూపర్ హిట్ అయింది. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ మూవీలో కామెడీ అద్భుతంగా పండింది. టాలీవుడ్‍లో కామెడీ క్లాసిక్‍గా వెంకీ నిలిచిపోయింది. ఇన్ని సంవత్సరాలు గడిచినా వెంకీ సినిమాను తెలుగు ప్రేక్షకులు మర్చిపోలేదు. ఇప్పటికీ వెంకీ మూవీ కామెడీ సీన్లను టీవీల్లో, ఆన్‍లైన్‍లో చూస్తూనే ఉంటారు. వెంకీ సినిమాలోని ట్రైన్ కామెడీ ఎపిసోడ్ చాలా మందికి ఫేవరెట్‍గా ఉంటుంది. రిలాక్స్ అయ్యేందుకు ఇప్పటికీ వెంకీ సినిమా…

Read More

అట్లాంటింక్ మహాసముద్రంలో విషాదం

అట్లాంటింక్ మహాసముద్రంలో విషాదం చోటుచేసుకుంది. మూడు పడవల్లో వెళుతున్న 300 మంది వలసదారులు సముద్రంలో గల్లంతయ్యారు. వీరంతా 15 రోజుల క్రితం సెనెగల్ నుంచి స్పెయిన్‌లోని కానరీ ఐలాండ్స్‌కు వెళుతుండగా ఈ ఘటన జరిగింది. ఒక బోటులో 200 మంది, మిగిలిన రెండు బోట్లలో 65, 60 మంది చొప్పున ఉన్నట్టు వలసదారులకు సాయం చేసే వాకింగ్ బోర్డర్స్ సంస్థ తెలిపింది. ఇపుడు ఈ అదృశ్యమైనవారు ఏమయ్యారో అంతుచిక్కడం లేదు. దీంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర…

Read More

సీఐ అంజూ యాదవ్ పై జనసేన న్యాయపోరాటం, ఎస్పీకి వినతిపత్రం ఇచ్చేందుకు తిరుపతికి పవన్

శ్రీకాళహస్తిలో ఇటీవల నిరసన తెలుపుతున్న జనసేన కార్యకర్త కొట్టే సాయిని సీఐ అంజూ యాదవ్ చెంప దెబ్బలు కొట్టారు. మరో జనసేన కార్యకర్తను కాలర్ పట్టుకుని స్టేషన్ కు లాక్కెళ్లారు. ఈ ఘటనపై మీడియాలో కథనాలు ప్రసారం అయ్యాయి. సీఐ అంజూ యాదవ్ అనుచిత ప్రవర్తనపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ఘటనను జనసేన సీరియస్ గా తీసుకుంది. ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. సోమవారం నేరుగా తిరుపతికి వెళ్లి ఎస్పీకి…

Read More

24/7 ఉచిత కరెంటుపై రేవంత్ ఛాలెంజ్

రైతులకు 24/7 కరెంటుపై తెలంగాణ అధికార పార్టీకి, ప్రతిపక్షం కాంగ్రెస్ ల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అవసరం లేదన్న రేవంత్ కామెంట్స్ పై బీఆర్ఎస్ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. రైతులపై కాంగ్రెస్ కు ఎలాంటి చిత్తశుద్ధి లేదంటూ ఆరోపిస్తుంది. ఈ క్రమంలో తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే రంగంలోకి దిగారు. తెలంగాణ రైతాంగానికి 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ను అందిస్తామని ప్రకటించారు. అయినప్పటికీ…

Read More

పబ్జీ బానిసై చివరకు మతిస్థిమితం కోల్పోయిన బాలుడు

రాజస్థాన్‌లో స్మార్ట్ ఫోన్ ఓ బాలుడి జీవితాన్ని చిదిమేసింది. స్మార్ట్‌ఫోనుకు బానిసైపోయిన ఓ పదేళ్ల బాలుడు చివరకు మతిస్థిమితం కోల్పోయాడు. రాజస్థాన్ అల్వార్‌కు చెందిన చిన్నారి నిత్యం ఫోనులో పబ్ జీ ఆడుతూ గడిపేవాడు. ఇటీవల గేమ్‌లో ఓడిపోయిన అతడు నిరాశను తట్టుకోలేక మతిస్థిమితం కోల్పోయాడు. ప్రస్తుతం అతడికి ప్రత్యేక పాఠశాలలో నిపుణుల సాయంతో చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు చెప్తున్నారు. ప్రత్యేకమైన భౌతిక క్రీడలు ప్రత్యేకమైన భౌతిక క్రీడలు ఆడిస్తూ బాలుడికి నయం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని పాఠశాల…

Read More

చదరంగం క్రీడతో ఉజ్వల భవిష్యత్తు : కొట్టు విశాల్

  పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, జులై 18 : మేధాశక్తికి పదును పెట్టి ఆడే చదరంగం క్రీడతో పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని వైకాపా యువ నాయకులు కొట్టు విశాల్ అన్నారు. స్థానిక డి ఎస్ ఆర్ ఫంక్షన్ హాల్ లో మాస్టర్స్ చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం మండల స్థాయి అండర్ 16 చెస్ టోర్నమెంట్ ను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జీవితంలో మరచిపోలేని క్రీడ చదరంగం అన్నారు. పిల్లల్లో క్రమశిక్షణ,…

Read More

జగనన్న సురక్షతో సమస్యలు పరిష్కారం

  పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, జూలై 18: : ప్రభుత్వం చేపట్టిన జగనన్న సురక్ష కార్యక్రమం చాలా మంచి కార్యక్రమమని పెద్దతాడేపల్లి గ్రామ సర్పంచ్ పోతుల అన్నవరం అన్నారు. తాడేపల్లిగూడెం మండలం పెదతాడేపల్లి గ్రామంలో మంగళవారం జగనన్న సురక్ష శిబిరం జరిగింది. ఈ శిబిరంలో పాల్గొన్న సర్పంచ్ అన్నవరం మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి జగనన్న సురక్ష ఉపయోగపడుతుందన్నారు . సచివాలయ వ్యవస్థను అందుబాటులోకి తీసుకు వచ్చిన తర్వాత వాలంటీర్ల ద్వారా ప్రజల అవసరాలు తెలుసుకుని అన్ని కార్యక్రమాలను…

Read More

దళితులు సాగు చేసే భూములపై గ్రామ రెవిన్యూ అధికారుల దాడులు ఆపాలి

  పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, జూలై 18: ఏళ్ల తరబడి సాగుచేసుకొనే దళితుల భూముల్లో గ్రామ రెవెన్యూ అధికారుల వేధింపులు ఆపాలని కె.వి.పి.ఎస్, డి.హెచ్.పి.ఎస్, కె.ఎన్.పి.ఎస్ జిల్లా కార్యదర్శులు కే.క్రాంతి బాబు, కళింగ లక్ష్మణరావు, గెడ్డం జార్జి డిమాండ్ చేశారు. మంగళవారం మండలంలోని కొండ్రు ప్రోలు గ్రామంలో ఏళ్ళ తరబడి సాగు భూముల సాగు చేసుకుంటున్న దళితులపై గ్రామ రెవెన్యూ అధికారుల వేధింపులు ఆపాలని కోరుతూ కె.వి.పి.ఎస్, డి.హెచ్.పి.ఎస్, కె.ఎన్.పి.ఎస్ సంఘాల ఆధ్వర్యంలో బాధితులతో కలిసి ఎమ్మార్వో…

Read More

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ప్రాజెక్ట్ కే సినిమాపై అందరి ఆసక్తి

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ప్రాజెక్ట్ కే సినిమాపై అందరి ఆసక్తి నెలకొని ఉంది. ఈ మూవీ అఫీషియల్ టైటిల్ ఏంటనే దానిపై చాలా ఊహాగానాలు వెలువడుతున్నాయి. గ్లోబల్ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. డైరెక్టర్ నాగ్ అశ్విన్.. ప్రాజెక్ట్ కే సినిమాను హాలీవుడ్ రేంజ్‍లో తెరకెక్కిస్తున్నాడు. బాలీవుడ్ సీనియర్ స్టార్ అమితాబ్ బచ్చన్, ప్రముఖ హీరో కమల్ హాసన్, స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణ్, దీశా పఠానీ…

Read More