Headlines

భర్తతో విడిపోతున్న అసిన్ ? ఇదిగో క్లారిటీ

అసిన్.. ఈ పేరు చెప్పగానే తెలుగు ప్రేక్షకులు ముందు గుర్తొచ్చే సినిమా గజిని. అంతకుముందు అమ్మానాన్న ఓ తమిళమ్మాయి, ఘర్షణ, శివమణి, అన్నవరం సినిమాల్లోనూ నటించిన అసిన్.. సూపర్ హిట్ సినిమాలతో ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లో అనేక సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా ఎదిగిన అసిన్.. 2016లో ముంబైకి చెందిన వ్యాపారవేత్త రాహుల్ శర్మను పెళ్లాడింది. అప్పటి నుంచి అసిన్ సినిమాలకు దూరంగా ఉంటోంది. వీరి వివాహ బంధానికి…

Read More

రైల్వే అండర్ బ్రిడ్జి సీపేజీలను అరికట్టండి: జిల్లా కలెక్టర్

  పశ్చిమగోదావరి జిల్లా, ఉండి, జూన్ 28: రైల్వే అండర్ బ్రిడ్జి సీపేజ్ లను వెంటనే అరికట్టాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ ఛాంబర్ నందు జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి భీమవరం పట్టణంలోని మూడు ఆర్.యు.బి ల సీపేజ్ లపై సంబంధిత రైల్వే అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆర్ యు బి లలో సీపేజ్ ల వలన ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారన్నారు….

Read More

మంత్రి కొట్టు వ్యాఖ్యలపై ధ్వజమెత్తిన బొలిశెట్టి శ్రీనివాస్

  పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, జూన్28 : పాతూరులో ఒక యువకుడు మరణం పై ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలను జనసేన నాయకులు తీవ్రంగా ఖండించారు. నిజా నిజాలు తెలుసుకోకుండా అనవసరంగా నోరు పారేసుకుంటున్నారంటూ వైసీపీ నాయకులపై ధ్వజమెత్తారు. లింగారాయుడు గూడెంలో ఒక యాదవ కుర్రవాడిని మీ ఎంపీటీసీ చంపేస్తే మీరు తీసుకునే చర్యలు ఏంటి అని బొలిశెట్టి శ్రీనివాసు ప్రశ్నించారు. అక్రమ సంబంధాలు అంటగట్టి కేసు మాఫీ చేసే ప్రయత్నం చేసి చివరికి…

Read More

డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలి – కమిషనర్ డాక్టర్ శామ్యూల్

  పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, జూన్ 28: తాడేపల్లిగూడెం పట్టణం లోచాలా కాలం గా అపరిష్కృతంగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థ ను గాడిలో పెట్టాలని తాడేపల్లిగూడెం మున్సిపల్ కమిషనర్ డాక్టర్ శామ్యూల్ బుధవారం ఉదయం 31 వ వార్డు 32 వ వార్డు కడకట్ల ప్రాంతాల్లో వార్డు బాట చేపట్టారు. మున్సిపల్ సానిటరీ సిబ్బందిని వెంటబెట్టుకుని ఆయన డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించారు. వెంటనే ఆయన మున్సిపల్ సానిటరీ సిబ్బందికి వర్కర్లకు డ్రైనేజీ వ్యవస్థను మెరుగు పరచాలని ఆదేశాలు…

Read More

జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులుగా తెన్నేటి జగ్జీవన్

  పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, జూన్ 28: పశ్చిమగోదావరి జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులుగా తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన తెన్నేటి జగ్జీవన్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన బుధవారం భీమవరంలోని కలెక్టరేట్లో జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి శోభారాణి చేతులు మీదుగా నియామక పత్రం అందుకున్నారు. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశాల మేరకు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి శోభారాణి నియామక పత్రాన్ని జగ్జీవన్ కు అందజేశారు. తనను…

Read More

చదువుకునే చిన్న పిల్లల ఎదుగుదలను కోరుకున్న చవ్వా గోపాల్ రెడ్డి 

అనంతపురం జిల్లా యాడికి మండలం ఉప్పలపాడు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఈ సంవత్సరం గురుకుల పాఠశాలకు 16 మంది విద్యార్థులు ఎంపిక అవడంతో అనంతపురం జిల్లా క్లాస్ వన్ కాంట్రాక్టర్ చవ్వ గోపాల్ రెడ్డి  ఆ పిల్లలకు పాఠ్య పుస్తకాలు. పెన్ను పెన్సిల్లు చదువుకు అవసరమైన వస్తువులను అందజేస్తూ మిఠాయిలు పంచిపెట్టారు. అలాగే ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు ఇద్దరు బదిలీపై వెళ్తున్న వారిని చవ్వ గోపాల్ రెడ్డి ఘనంగా సన్మానించారు.  అనంతరం ఆయన మాట్లాడుతూ .. ప్రైవేటు…

Read More

మహిళలపై హింసకు వ్యతిరేకంగా నిరసన

  పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, జూన్ 27 : అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం పట్టణ కమిటీ మహిళలపై హింసకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేశారు .ఈ సందర్భంగా పట్టణ కార్యదర్శి బంకుర యశోద అధ్యక్షురాలు మీసాల పావని పాల్గొన్నారు. జిల్లా కమిటీ నుంచి 5వ జిల్లా కార్యదర్శి పొగాకు పూర్ణ పాల్గొని మాట్లాడుతూ రోజురోజుకీ మహిళలపై హింస పెరుగుతుందని దారుణంగా అమర్నాథ్ను హత్య చేసి పెట్రోల్ పోసి తగులు పెట్టిన ఘటన…

Read More

NTR అభిమాని శ్యాం మణికంఠ మృతి పై అనుమానాలు నివృత్తి చేయాలి… తెలుగుదేశం పార్టీ నాయకులు డిమాండ్….

జూనియర్ ఎన్టీఆర్ అభిమాని మేడిశెట్టి శ్యాం మణికంఠ అనుమానాస్పద మరణం పై వారి తల్లిదండ్రుల అనుమానాలు నివృత్తి చేయాలని, సమగ్ర విచారణ జరిపించాలని డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా టిడిపి నాయకులు బండారు సత్యానందరావు, రెడ్డి సుబ్రహ్మణ్యం, దాట్ల బుచ్చిబాబు, గంటి హరీష్ మాధుర్, మోక ఆనంద సాగర్ డిమాండ్ చేశారు … కొత్తపేట మండలం మోడేకుర్రు శివారు కడలివారిపాలెంలో అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన శ్యామ్ మణికంఠ మృతి పై మణికంఠ తల్లిదండ్రులతో కలిసి టిడిపి నేతలు…

Read More

శాకాంబరీ దేవిగా శ్రీ నూకాంబిక అమ్మవారు

ఆలమూరు (చింతలూరు) చింతలూరు లో వేంచేసి ఉన్న జగన్మాత శ్రీ నూకంబిక అమ్మవారు గుప్త నవరాత్రుల్లో భాగంగా ఆషాడ శుద్ధ నవమి మంగళవారం నాడు శాకంబరీ దేవిగా దర్శనమిచ్చారు. పూర్వం దుర్గమాసురుడనే రాక్షసుడు వేదాలను అపహరించి లోకంలో యజ్ఞయాగాది క్రతువులు జరగకుండా అడ్డుకున్నాడు, ఆ సమయంలో లోకమంతా కరువుతో అల్లాడి చీకట్లు అలముకున్నాయి. ఆ సమయంలో మహర్షులు అమ్మవారిని ప్రార్థించగా అమ్మవారు దివ్య తేజస్సుతో శతాక్షి దేవిగా అవతరించి వానలు కురిపించారు. శాకంబరిగా మారి లోకంలో వారందరికీ…

Read More