Headlines

తెరుచుకోని విద్యుత్ సేవా కేంద్రం ఇబ్బందులు పడుతున్న వినియోగదారులు చోద్యం చూస్తున్న అధికారులు

  కొత్తపేట : అధికారుల అలసత్వం కారణంగా విద్యుత్ వినియోగదారుల సేవా కేంద్రం నిరుపయోగంగా మారింది. సేవా కేంద్రం కొన్ని రోజులుగా తాళం వేసి ఉండడంతో వినియోగదారులు అక్కడికి వచ్చి ఉసూరుమంటూ తిరిగి వెళ్ళిపోతున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండల కేంద్రం బస్టాండ్ సెంటర్లో ఉన్న విద్యుత్ వినియోగదారుల సేవా కేంద్రం కొన్ని రోజులుగా తెరవడం లేదు. ఈ సేవా కేంద్రం పరిసర ప్రాంతాలలోని ప్రజలకు విద్యుత్ బిల్లులు కట్టించుకునేందుకు, ఎలక్ట్రికల్ సమస్యలు ఏమైనా ఉంటే…

Read More

బందారంలో మత్స్యకారులకు నైపుణ్య పరీక్షలు

కొండపాక మండలం బందారం గ్రామంలోని 56 మంది ముదిరాజ్ కుల సంఘ సభ్యులకు నూతనంగా మత్స్యశాఖ సభ్యత్వంకై గజ్వేల్ డివిజన్ మత్స శాఖ అధికారి వి. శ్రీనివాస్ రెడ్డి, ఫిషరీస్ ఇన్స్పెక్టర్ సురేష్ శనివారం బందారం గ్రామంలోని ఊర చెరువులో నైపుణ్య పరీక్షలు నిర్వహించారు. మత్స్యశాఖ నైపుణ్య పరీక్షల్లో భాగంగా సభ్యులకు అధికారులు చెరువులో ఈదడం, వలలు అల్లడం, తెప్పపై వెళ్లడం, వల విసరడం, చేపలు పట్టే ఐదు రకాల పరీక్షలు నిర్వహించారు. మత్స్యశాఖలో సభ్యత్వం ఉంటేనే…

Read More

మానేపల్లి అరవింద మృతదేహాన్ని కొత్తపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నందు పరిశీలించి ఆమె తండ్రి ఎల్లా సత్యనారాయణకు 10,000 వేల రూపాయలు ఆర్థికసహాయం

ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న కొత్తపేట గ్రామానికి చెందిన మానేపల్లి అరవింద మృతదేహాన్ని కొత్తపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నందు పరిశీలించి ఆమె తండ్రి ఎల్లా సత్యనారాయణకు 10,000 వేల రూపాయలు ఆర్థికసహాయం చేశారు.

Read More

.. సిద్దిపేట జిల్లా రెడ్డి జె ఎ సి .. అద్వర్యములో కొండపాక మండలం వేలికట్టా x రోడ్ లో విలేకరుల సమావేశం

  .. సిద్దిపేట జిల్లా రెడ్డి జె ఎ సి .. అద్వర్యములో కొండపాక మండలం వేలికట్టా x రోడ్ లో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది.. రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు సాదన కై ఎప్రిల్ 11 న నిరసన దీక్ష సిద్దిపేట జిల్లా రెడ్డి జె ఎ సి అధ్యక్షులు …. అయిలేని మల్లికార్జున్ రెడ్డి.. రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాము అని బి అర్ యస్ ప్రభుత్వం మేనిఫెస్టో లో పెట్టి నాలుగు సంవత్సరాలు…

Read More

KPK:- కొండపాక రెడ్డి సంఘం నాయకుల మీడియా సమావేశం..

  సిద్దిపేట జిల్లా రెడ్డి JAC పిలుపు మేరకు కొండపాక మండలం వెలికట్ట చౌరస్తా వద్ద మండల అధ్యక్షుడు దేశిరెడ్డి రామ చంద్రారెడ్డి అధ్యక్షతన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు // రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు సాదన కై ఈ నెల 11 వ తేదీ న నిరసన దీక్ష ప్రారంభం చేస్తున్నట్లు తెలిపారు // ఈ మీడియా సమావేశానికి జిల్లా రెడ్డి JAC అధ్యక్షులు అయిలేని మల్లికార్జున్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు// ఈ సంద్భంగా…

Read More

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా శ్రీసత్యసాయి సేవా సంస్థలు- జిల్లా స్ధాయి సర్వసభ్య సమావేశం

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా శ్రీసత్యసాయి సేవా సంస్థలు- జిల్లా స్ధాయి సర్వసభ్య సమావేశం స్ధానిక శ్రీసత్యసాయి అష్టదళ సేవా పుష్పం (సేవా కేంద్రం)లో శ్రీసత్యసాయి సేవా సంస్థలు జిల్లా అధ్యక్షుడు అడబాల కొండబాబు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి శ్రీసత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర అధ్యక్షులు ఆర్.లక్ష్మణరావు, రాష్ట్ర సాంస్కృతిక విభాగ సమన్వయకర్త యమ్‌.యస్.ప్రకాశరావులు ముఖ్య అతిథిలుగా హాజరైనారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి వ్యక్తి నిత్యం వ్యక్తిగత సాధన చేసుకుంటూ…

Read More

నేటి నుంచి జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం

నేటి నుంచి జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా 1.60 కోట్ల కుటుంబాలను కలవనున్న 7 లక్షల మంది వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ సైనికులు. కొత్తపేట నియోజకవర్గంలో కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి, నియోజకవర్గ పరిశీలకులు కొమ్మన శివ. జగనన్నే మన భవిష్యత్తు కార్యక్రమం పేరిట నియోజకవర్గంలోని 1లక్షా 5 వేల కుటుంబాలను పార్టీ సైనికులు కలవనున్నారని ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా రావులపాలెం వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ…

Read More

కోనసీమ జిల్లాలో గంజాయి విక్రయాలకు సంబంధించి సమాచారం అందిస్తే 50,000/- నజరానా – జిల్లా కలెక్టర్

అంబెడ్కర్ కోనసీమజిల్లాలో గంజాయి రవాణా, అమ్మే వారి(పెడ్లర్స్) సమాచారం పోలీసులకు అందిస్తే 50 వేల రూపాయలు. గంజాయి వినియోగించే వారి సమాచారం అందిస్తే 10 వేల రూపాయలు బహుమతిగా ఇస్తామని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు.  గురువారం మధ్యాహ్నం గంజాయి మరియు ఇతర డ్రగ్స్ నియంత్రణలో మెరుగైన సమన్వయం కోసం జిల్లా స్థాయి కమిటీ (NCORD) సమావేశం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా…

Read More

అయ్యప్ప స్వామి వారికి 36 రకాల వంటకాలు బడుగువానిలంకలో వైభవంగా అభిషేకాలు

  ఫాల్గుణ మాసం,పౌర్ణమి తిథి, ఉత్తర నక్షత్రంలో అయ్యప్ప స్వామి జన్మదిన వేడుకలు నిర్వహిస్తారు. ఈ ఏడాది ఆ వేడుకలు స్వామి వారి ప్రీతికరమైన బుధవారం రావడంతో అయ్యప్ప భక్తులు పెద్ద ఎత్తున పూజాది అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం బడుగువానిలంకలో హరిహర సుతుడు అయ్యప్ప స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. 36 రకాల పంచామృత,పళ్ళ రసాలు, సుగంధద్రవ్యాలతో అభిషేకించారు.అలాగే 36 రకాల పిండి వంటలు స్వామి వారికి నివేదించారు. చొప్పెల్ల శివాలయం…

Read More

ప్రజల గడపలలోకి ప్రభుత్వ వైద్య సేవలు

ప్రజల గడపలలోకి ప్రభుత్వ వైద్య సేవలు నేటి నుండి ఆంధ్రప్రదేశ్ లో ఫ్యామిలీ ఫిజిషియన్ కార్యక్రమం ప్రారంభం రావులపాలెంలో కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి ప్రజల గడపలలోకి మెరుగైన ప్రభుత్వ వైద్య సేవలు అందించేందుకు ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి కృషితో ఫ్యామిలీ ఫిజిషియన్ కార్యక్రమాన్ని నేటి నుండి ప్రారంభించడం జరుగుతుంది అని ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. రావులపాలెం గ్రామ సచివాలయం-4 పరిధిలో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు….

Read More